రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
WEATHER REPORT: 21న అల్పపీడనం.. నేడు, రేపు భారీ వర్షాలు
ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు, రేపు ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది.
నైరుతి రుతు పవన ద్రోణి అక్షం హిమాలయ పర్వత శ్రేణికి చేరువగా కొనసాగుతోందని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉపరితల ద్రోణి ఒకటి కోస్తా ఆంధ్రప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 4.5 కిలో మీటర్ల మధ్యలో ఏర్పడిందని వెల్లడించింది. ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. తూర్పు-పశ్చిమ ద్రోణి సముద్ర మట్టానికి 3.1 కిలో మీటర్ల నుంచి 5.8 కిలో మీటర్ల మధ్య కొనసాగుతూ ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ వైపు వంపు తిరిగి ఉందని తెలిపింది.
ఇదీ చూడండి: Dk Aruna : కేంద్రం నిర్ణయంతో ఏపీ జల దోపిడీకి అడ్డుకట్ట