రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ఇవాళ స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 1,04,478 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 657 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారిన పడి ఇద్దరు మరణించారు. ఇప్పటి వరకు నమోదైన కేసులతో కలిపి మొత్తం సంఖ్య 6,38,030 కి చేరింది.
మహమ్మారి బారి నుంచి మరో 704 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 6, 24, 477 మంది సురక్షితంగా బయటపడ్డారు. ఇవాళ మరణించిన ఇద్దరితో కలిపి మొత్తం సంఖ్య 3,766 కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జీహెచ్‌ఎంసీలోనే అత్యధికం
తాజా కేసుల్లో అత్యధికంగా 74 కేసులు జీహెచ్‌ఎంసీలో నమోదయ్యాయి. జిల్లాల వారీగా వచ్చిన కేసులను పరిశీలిస్తే ఆదిలాబాద్ 2, భద్రాద్రి కొత్తగూడెం 25 , జగిత్యాల 22, జనగామ 9, జయశంకర్ భూపాలపల్లి 10, జోగులాంబ గద్వాల్ 4, కామారెడ్డి 4, కరీంనగర్ 45, ఖమ్మం 58, కుమురంభీం ఆసిఫాబాద్ 4, మహబూబ్ నగర్ 7, మహబూబాబాద్ 16, మంచిర్యాల 43, మెదక్ 5, మేడ్చల్ మల్కాజ్‌గిరి 27, ములుగు 7, నాగర్ కర్నూల్ 6, నల్గొండ 41, నారాయణ పేట్ 2, నిర్మల్ 3, నిజామాబాద్ 6, పెద్దపల్లి 45, రాజన్న సిరిసిల్ల 21, రంగారెడ్డి 31 , సంగారెడ్డి 6, సిద్దిపేట 11, సూర్యాపేట 42, వికారాబాద్ 3, వనపర్తి 4, వరంగల్ రూరల్ 11, వరంగల్ అర్బన్ 43, యాదాద్రి భువనగిరిలో 20 కొవిడ్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి:Corona Cases: కొత్తగా 746 మందికి వైరస్.. మరో ఐదు మరణాలు