రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 71,800 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 605 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,26,690కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో ఏడుగురు బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,691కి చేరింది.
TS CORONA CASES: రాష్ట్రంలో భారీగా తగ్గిన కేసులు.. కొత్తగా ఏడు మరణాలు
రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టింది. తాజాగా 605 కరోనా కేసులు నమోదు కాగా.. మహమ్మారితో మరో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,964 కరోనా క్రియాశీల కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు.
TS CORONA CASES
ఒక్కరోజు వ్యవధిలో 1,088 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,11,035కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 11,964 యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 605 కరోనా కేసులు, 7 మరణాలు నమోదయ్యాయి. మరో 1,088 మంది బాధితులు మహమ్మారి నుంచి కోలుకున్నారు.