రాష్ట్రంలో మొత్తం 1009... కొత్తగా 6 కరోనా కేసులు - TOTAL CASES RAISED TO 1009

18:23 April 28
రాష్ట్రంలో మొత్తం 1009... కొత్తగా 6 కరోనా కేసులు
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 6 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు. మొత్తంగా పాజిటివ్ కేసులు 1009కి పెరిగాయన్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటి వరకు 25 మంది మృతి చెందారని మంత్రి వివరించారు. ఇవాళ ఒక్క రోజే 42 మంది డిశ్చార్జ్ అయ్యారని ఆయన చెప్పారు. 374 మంది కోలుకుంటున్నారని, వారంతా డిశ్చార్జ్ కానున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రుల్లో 610 మంది చికిత్స పొందుతున్నారని మంత్రి స్పష్టం చేశారు. కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 50 శాతానికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయని ఈటల అన్నారు.
ఇవీ చూడండి : మే 8 వరకు పూర్తి స్థాయిలో కోలుకుంటాం : మంత్రి ఈటల