రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 52,702 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 248 కొత్త కేసులు(TS Corona cases) నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసులు 6,64,898కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా కేసులు, ఒకరు మృతి - tg corona cases
రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 248 కరోనా కేసులు (TS Corona cases)నమోదు కాగా.. ఒకరు మృతి చెందారు. తాజాగా కరోనా నుంచి మరో 324 మంది బాధితులు కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,701 కరోనా యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.
TS CORONA CASES: రాష్ట్రంలో కొత్తగా 248 కరోనా కేసులు, ఒకరు మృతి
తాజాగా ఇవాళ మరొకరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,912కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో 324 మంది వైరస్ బారినుంచి కోలుకున్నారు. మొత్తం కోలుకున్న వారి సంఖ్య 6,56,285కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,701 యాక్టివ్ కేసులున్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Weather Report: వాయుగుండం తీవ్రరూపం.. తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు!