రాష్ట్రంలో నేడు మరో 22 కరోనా పాజిటివ్ కేసులు - కొత్తగా మరో 22 కొవిడ్-19 పాజిటివ్ కేసులు
![రాష్ట్రంలో నేడు మరో 22 కరోనా పాజిటివ్ కేసులు కొత్తగా మరో 22 కొవిడ్-19 పాజిటివ్ కేసులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7008559-thumbnail-3x2-coronaaa.jpg)
21:13 April 30
రాష్ట్రంలో నేడు మరో 22 కరోనా పాజిటివ్ కేసులు
రాష్ట్రంలో కొత్తగా మరో 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 1038కి చేరుకుంది. కరోనాతో రాష్ట్రంలో నేడు ముగ్గురు మృతి చెందారు. వైరస్ నుంచి కోలుకుని 33 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత ఐదు రోజులుగా దాదాపు పది దాటని కేసులు ఇవాళ ఒక్క రోజే 22 రావడం గమనార్హం. ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 28కి చేరింది. తాజాగా మలక్ పేట, పహాడీ షరీఫ్ ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్స్‌గా ప్రకటించింది.
ఇవీ చూడండి : భారత్‌లో కరోనా విజృంభణ.. 24 గంటల్లో 67మంది మృతి
TAGGED:
CORONA