రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 14 కరోనా కేసులు నమోదుకాగా ఇద్దరు మరణించారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 12, మేడ్చల్ మల్కాజిగిరిలో ఒకటి, నిజామాబాద్‌లో ఒక్క కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొత్తగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 872కు చేరింది. ఇవాళ నమోదైన రెండు కేసులతో కలిపి మృతులు 23కు చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం వివిధ ఆస్పత్రుల్లో 663 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు - new cases in telangana update news
రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్ కేసులు
20:06 April 20
రాష్ట్రంలో కొత్తగా 14 కరోనా పాజిటివ్ కేసులు
Last Updated : Apr 20, 2020, 8:37 PM IST