తెలంగాణ

telangana

ETV Bharat / state

'టొసిలిజుమాబ్ బ్లాక్​ ఫంగస్ కోసం కాదు... ప్రత్యామ్నాయమిదే' - టొసిలిజుమాబ్ దేని కోసం వాడుతారు?

టొసిలిజుమాబ్ కరోనా తీవ్రంగా ఉన్నవారికే వినియోగిస్తారని... బ్లాక్​ ఫంగస్ కోసం కాదని మంత్రి కేటీఆర్​కు గురుగావ్​కు చెందిన వైద్యనిపుణుడు అర్విందర్ సింగ్​ తెలిపారు. ప్రత్యామ్నాయంగా ఏమి ఉపయోగించాలని మంత్రి అడగ్గా అంఫోటెరిసిన్‌, పొసకానాజోల్‌ ఔషధాలను సొయిన్‌ సూచించారు.

tocilizumab-medicine-is-not-for-black-fungus
'టొసిలిజుమాబ్ బ్లాక్​ ఫంగస్ కోసం కాదు... ప్రత్యామ్నాయమిదే'

By

Published : May 18, 2021, 7:09 AM IST

టొసిలిజుమాబ్‌ ఔషధాన్ని కరోనా తీవ్రస్థాయిలో ఉన్న రోగుల చికిత్స కోసమే వినియోగిస్తారని, బ్లాక్‌ఫంగస్‌ కోసం కాదని దిల్లీలోని గురుగావ్‌కు చెందిన వైద్యనిపుణుడు అర్విందర్‌సింగ్‌ సొయిన్‌ ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. గత కొన్నిరోజులుగా పలువురు రోగుల బంధువులు బ్లాక్‌ఫంగస్‌ చికిత్స కోసం టొసిలిజుమాబ్‌ ఇంజక్షన్‌ వాయిల్స్‌ను ఉచితంగా అందించాలని కేటీఆర్‌ను అభ్యర్థిస్తుండగా ఆయన కార్యాలయం సమకూరుస్తోంది. ఈ నేపథ్యంలో సొయిన్‌ మంత్రికి ట్వీట్‌ చేశారు. ప్రత్యామ్నాయంగా ఏమి ఉపయోగించాలని మంత్రి అడగ్గా అంఫోటెరిసిన్‌, పొసకానాజోల్‌ ఔషధాలను సొయిన్‌ సూచించారు.

రక్తక్యాన్సర్‌ చికిత్సకు రూ.8 లక్షల సాయం

వరంగల్‌కు చెందిన రక్తక్యాన్సర్‌ బాధితుడైన 11 ఏళ్ల బాలుడు గజ్జెల అశోక్‌కుమార్‌కు రూ.8 లక్షలతో చికిత్స చేయించేందుకు మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. బాలుడి తండ్రి కాకతీయ వైద్య కళాశాల మాజీ డ్రైవర్‌ అని, పేద కుటుంబమైనందున సహాయం చేయాలని ఒక నెటిజన్‌ ట్విటర్‌లో కోరగా... ఆదుకుంటామని మంత్రి తెలిపారు. 14 నెలల వయసుగల తన కుమారుడి గుండె శస్త్రచికిత్సకు రూ.1.80 లక్షలు అవసరమని అనిత అనే మహిళ కోరగా.. వెంటనే ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి శస్త్రచికిత్సకు ఏర్పాట్లు చేయాలని కేటీఆర్‌ తమ కార్యాలయ సిబ్బందిని ఆదేశించారు. బాలుడి సంరక్షణ బాధ్యత తమదేనని ఆయన అనితకు హామీ ఇచ్చారు.

ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన 8 నెలల బాలికకు నోటి శస్త్రచికిత్సకు సాయం చేయాలని ఒక నెటిజన్‌ కోరారు. నిలోఫర్‌ ఆసుపత్రి సూపరింటెండెంటుతో మాట్లాడి కేటీఆర్‌ ఏర్పాట్లు చేయించారు. శంషాబాద్‌ వద్ద ఇటుకబట్టీలో పనిచేస్తున్న ఒడిశా వలస కార్మికులను కేటీఆర్‌ ఆదేశాల మేరకు పోలీసులు ఆదుకున్నారు. ఆదివారం ట్విటర్‌లో కార్మికుల తమ ఇబ్బందులను మంత్రి దృష్టికి తెచ్చారు. పోలీసులు ఇటుకబట్టి యాజమానిపై కేసు నమోదు చేశారు. కార్మికులకు రావాల్సిన వేతనాలను ఇప్పించారు.

ఇదీ చూడండి:బ్లాక్‌ ఫంగస్ చికిత్స ఏర్పాట్లు, ఔషధాలపై వివరాలు ఇవ్వాలి: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details