తెలంగాణ

telangana

ETV Bharat / state

రాష్ట్రంలో 17 శాతం పొగాకు వినియోగదారులు - పొగాకు

తెలంగాణలో పొగాకు ఉత్పత్తుల వినియోగం పెరుగుతోందని.. వినియోగిస్తున్న వారిలో 14 శాతం మంది యువత ఉన్నారని స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట్​రావు స్పష్టం చేశారు.

రాష్ట్రంలో 17 శాతం పొగాకు వినియోగదారులు

By

Published : Aug 24, 2019, 6:51 AM IST

పొగాకును వినియోగిస్తూ ఎంతో మంది క్యాన్సర్, టీబీ, గుండె సంబంధ జబ్బులతో మరణిస్తున్నారు. ఈ కారణంతో హెల్త్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా, ఇండియన్ డెంటల్ అసోసియేషన్ సంయుక్తంగా పొగాకు ఉత్పత్తుల నియంత్రణపై సికింద్రాబాద్​లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్ వెంకట్​రావు పాల్గొన్నారు. జాతీయ స్థాయిలో 30 శాతం పొగాకు వినియోగిస్తుండగా, తెలంగాణలో 17 శాతానికి పైగా ప్రజలు వినియోగిస్తున్నారని తెలిపారు. పొగ తాగే వారి పక్కనున్న వారు సైతం 30 శాతం మంది ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వివరించారు.

పొగాకు ఉత్పత్తుల నియంత్రణపై 2003లో ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చినా అమలుకు నోచుకోలేదని వెల్లడించారు. ఇటీవల కాలంలో దేశంలో యువత ఈ- సిగరెట్ అనేది ఎక్కువగా తాగుతున్నారని అన్నారు. ఇందులో ఉండే నికోటిన్ అనే రసాయనం వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంస్థ ఆధ్వర్యంలో కళాశాలలు, పాఠశాలల్లో, విద్యార్థులు, ఉపాధ్యాయులు వీటి పట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

రాష్ట్రంలో 17 శాతం పొగాకు వినియోగదారులు

ఇదీ చూడండి : డ్రోన్ సహాయంతో దోమల సంతతికి స్వస్తి

ABOUT THE AUTHOR

...view details