ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చర్చలకు పిలవగా... నాంపల్లిలోని టీఎన్జీవో భవన్‌లో 33 జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శులు సమావేశమయ్యారు.
సీఎం చర్చలకు ఆహ్వానించడంపై ఉద్యోగ సంఘాల నేతల హర్షం - ప్రగతి భవన్‌లో ఉద్యోగ సంఘాలతో సీఎం సమావేశం
ఉద్యోగుల సమస్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు సీఎంకు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ప్రగతిభవన్‌లో ఉద్యోగ సంఘాలతో కేసీఆర్ సమావేశం నిర్వహించనున్నారు. వారి డిమాండ్లపై ప్రధానంగా చర్చించనున్నారు.
![సీఎం చర్చలకు ఆహ్వానించడంపై ఉద్యోగ సంఘాల నేతల హర్షం tngos leaders interact with cm kcr in pragathi bhavan today inmhyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10067977-86-10067977-1609398994740.jpg)
ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల డైరీలు, క్యాలెండర్లను ఆవిష్కరించనున్న సీఎం ఆవిష్కరించనున్నారు. సీఎస్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. సీఎంతో చర్చించాల్సిన అంశాలపై జిల్లాల అధ్యక్షులతో రాజేందర్ సమీక్షించారు. ప్రధానంగా 16 డిమాండ్లపై కేసీఆర్ సానుకూలంగా స్పందించారని... రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 10 లక్షల 50వేల మంది ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వేతన సవరణ సమస్యను జనవరిలోనే పరిష్కరించాలని కోరతామని తెలిపారు. సమావేశంలో పాల్గొనేందుకు ఉద్యోగసంఘాల నేతలు, ప్రతినిధులు ప్రగతిభవన్‌కు చేరుకుంటున్నారు.