ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల తెలంగాణ టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిండ్ల రాజేందర్ హర్షం వ్యక్తం చేశారు. పెరిగిన ఖర్చులను దృష్టిలో ఉంచుకొని మెరుగైన ఫిట్మెంట్ ఇస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కేసీఆర్ నిర్ణయంపై టీఎన్జీవో హర్షం - తెలంగాణ వార్తలు
ఉద్యోగులకు వేతనాలు, పదవీ విరమణ వయస్సును పెంచాలన్న సీఎం కేసీఆర్ నిర్ణయంపై తెలంగాణ టీఎన్జీవో కేంద్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. పదోన్నతులు, బదిలీలతో పాటు 11వ పీఆర్సీని త్వరగా ప్రకటించాలని కోరారు.
కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేసిన టీఎన్జీవో
ఉద్యోగుల వేతనాల పెంపు, పదవీ విరమణ వయస్సు పెంపుపై కమిటీ వేయడం హర్షించదగ్గ విషయమని... కమిటీ నివేదికను త్వరితగతిన తెప్పించుకుని వీలైనంత త్వరగా ప్రకటించాలని కోరారు. కొత్త ఉద్యోగాల నియమాలను చేపట్టడం కూడా శుభపరిణామమని తెలిపారు. పదోన్నతులు, బదిలీలు చేపట్టడంతో పాటు... 11వ పీఆర్సీ త్వరగా ప్రకటించాలని కోరారు.
ఇదీ చూడండి:రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు