తెలంగాణ

telangana

ETV Bharat / state

'స్పష్టత ఇవ్వని పీఆర్సీ కమిషన్ కమిటీని రద్దు చేయాలి' - TNGOs latest news today

ఉద్యోగులకు స్పష్టత ఇవ్వని పీఆర్సీ కమిషన్ కమిటీని రద్దు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

tngos-demand-the-prc-commission-committee-which-did-not-give-clarity-should-be-dissolved
'స్పష్టత ఇవ్వని పీఆర్సీ కమిషన్ కమిటీని రద్దు చేయాలి'

By

Published : Oct 3, 2020, 5:59 PM IST

ఉద్యోగులకు స్పష్టత ఇవ్వని పీఆర్సీ కమిషన్ కమిటీని రద్దు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇటీవల ఎన్నికైన కేంద్ర సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రాజేందర్, ప్రతాప్, మాజీ అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డిలను నాంపల్లి సంఘం కార్యాలయంలో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ సన్మానించారు.

పీఆర్సీ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగ సంఘ నాయకులతో సమావేశంలో నిర్వహించి చర్చించాలని వారు పేర్కొన్నారు. లాక్​డౌన్ నేపథ్యంలో జీతాల్లో కోత విధించిన 50 శాతాన్ని చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించడం పట్ల వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల హెల్త్ కార్డ్​ను పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పారు. పెండింగ్​లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ట్రానికి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఇదీ చూడండి :దుబ్బాక ఉపఎన్నికపై భాజపా సమావేశం.. కిషన్​రెడ్డి హాజరు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details