22 అంశాలతో తీర్మానం:
22 అంశాల తీర్మానంతో ఆర్టీసీ సమ్మెకు టీఎన్జీవో మద్దతు - టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి
ఆర్టీసీ సంఘాల సమ్మెకు టీఎన్జీవో పూర్తి మద్దతు తెలిపింది. సుమారు 22 అంశాలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ టీఎన్జీవో తీర్మానించింది. నేడు ఆర్టీసీ, ప్రభుత్వం ఉద్యోగ సమస్యలపై సీఎస్‌ను కలిసి విన్నవిస్తామని టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి తెలిపారు.
సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికుల స్థానంలో విధులు నిర్వర్తించటానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీఎన్జీవోస్ కోరారు. పీఆర్సీ మంజూరు, సీపీఎస్ రద్దు, రిటైర్మెంట్ వయోపరిమితి పెంపు, ఆంధ్రాలో పనిచేస్తోన్న తెలంగాణ ఉద్యోగులను వెనక్కి రప్పించటం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, జిల్లాల క్యాడర్ స్ట్రెంగ్త్, పెన్షనర్లకు 15 శాతం అదనపు పింఛను మంజూరు తదితర 15 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ టీఎన్జీవో తీర్మానించింది.
ఇదీ చదవండిః కలెక్టర్లతో కేటీఆర్ దృశ్యమాధ్యమ సమీక్ష