తెలంగాణ

telangana

ETV Bharat / state

సీఎంతో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తాం: టీఎన్జీవో అధ్యక్షుడు - టీఎన్జీవో నూతన అధ్యక్షుడు రాజేందర్ తాజా వార్తలు

సీఎం కీసీఆర్‌తో చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని రాష్ట్ర నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడు రాజేందర్‌ హామీ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు.

సీఎం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తాం: టీఎన్జీవో అధ్యక్షుడు
సీఎం చర్చలు జరిపి సమస్యలు పరిష్కరిస్తాం: టీఎన్జీవో అధ్యక్షుడు

By

Published : Sep 18, 2020, 6:45 PM IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమై.. చర్చలు జరిపి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నూతన అధ్యక్షుడు ఎం. రాజేందర్ తెలిపారు. నగర శివారు శివరాంపల్లిలోని రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సన్మాన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు ఆయనను సన్మానించారు.

టీఎన్జీవో గత అధ్యకుడు కారం రవీందర్ రెడ్డి స్థానంలో రాజేందర్ ఈ మధ్య ఎన్నుకోబడ్డారు. రాజేందర్ ప్రస్తుతం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమంలో పనిచేస్తున్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో స్వరాజ్యాలక్ష్మీ, రాష్ట్ర, జిల్లా టీఎన్‌జీవో నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:గుత్తా సుఖేందర్​రెడ్డిని కలిసిన టీఎన్జీవో నేతలు

ABOUT THE AUTHOR

...view details