సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి గవర్నర్కు లేఖ రాశారు. తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని లేఖలో ఆరోపించారు. ప్లాట్ల కేటాయింపు విషయంలో అవినీతి నిరోధక శాఖతో దర్యాప్తు జరిపించాలని కోరారు.
ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు: పద్మనాభ రెడ్డి - hyderabad latest news
తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో భారీ అక్రమాలు చోటు చేసుకున్నాయని సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి ఆరోపించారు. ప్లాట్ల కేటాయింపు విషయంలో అవినీతి నిరోధక శాఖతో దర్యాప్తు జరిపించాలని గవర్నర్కు లేఖ రాశారు.
ఇళ్ల స్థలాల కేటాయింపులో అక్రమాలు: పద్మనాభ రెడ్డి
2003లో కేటాయించిన భూమిలో అనుమతి లేకుండా ప్లాట్లుగా విభజించి.. నిబంధనలు పాటించకుండా అప్పటి టీఎన్జీవో నేతలు కేటాయించారని పద్మనాభ రెడ్డి ఆరోపించారు. అవకతవకలు జరిగినట్లు కలెక్టర్ నిర్ధరించి నివేదికను ప్రభుత్వానికి సమర్పించి 2 ఏళ్లైనా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు.