తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 74వ వర్ధంతిని తెలంగాణ ఉద్యోగ ఐకాస ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా జరిపారు. నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డి హాజరయ్యారు. కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
'దొడ్డి కొమురయ్య జీవితం.. నేటి తరానికి ఆదర్శం' - టీఎన్జీవో భవన్లో దొడ్డి కొమురయ్య 74వ వర్ధంతి
హైదరాబాద్ నాంపల్లిలోని టీఎన్జీవో భవన్లో తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య 74వ వర్ధంతిని తెలంగాణ ఉద్యోగుల ఐకాస సభ్యులు నిర్వహించారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ ఛైర్మన్ నందిని సిద్ధారెడ్డి పాల్గొని నివాళులర్పించారు.
!['దొడ్డి కొమురయ్య జీవితం.. నేటి తరానికి ఆదర్శం' tngo members condolences on kumuraiah vardanthi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7893789-258-7893789-1593871575922.jpg)
టీఎన్జీవో భవన్లో దొడ్డి కొమురయ్య 74వ వర్ధంతి
కొమురయ్య అమరత్వం తెలంగాణ ప్రజా పోరాటాల చరిత్రలో విశిష్టమైనదని ఐకాస ఛైర్మన్ రవీందర్రెడ్డి అన్నారు. స్వరాష్ట్రంలో మన చరిత్ర-మన సంస్కృతి వికాసం కొనసాగుతోందని... అమరవీరుల స్వప్నాలు ఇప్పుడిప్పుడే సాకారమవుతున్నాయని రవీందర్రెడ్డి అభిప్రాయపడ్డారు.
TAGGED:
tngo on kumuraiah vardanthi