తెలంగాణ

telangana

ETV Bharat / state

లాక్​డౌన్​ వేళ.. నిరుపేదలకు అండగా టీఎన్జీవో సంఘం

కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో పలు స్వచ్ఛంద సంస్థలు నిరుపేదలకు అండగా నిలుస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, రోగుల సహాయకులకు తెలంగాణ టీఎన్జీవో సంఘం.. నిత్యాసవర సరుకులను, భోజనాన్ని అందజేస్తూ... అండగా నిలుస్తోంది.

TNGO FOOD DISTRIBUTION
TNGO FOOD DISTRIBUTION

By

Published : May 20, 2021, 3:27 PM IST

ఆకలితో అలమట్టిస్తున్న నిరుపేదలకు.. తెలంగాణ ఎన్జీవో సంఘం నిత్యం పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సహాయం చేస్తున్నారు. లాక్​డౌన్​లో ప్రతిరోజు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు, రోగుల సహాయకులకు తెలంగాణ టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు ముజీబ్ హుస్సేనీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు, భోజనం అందజేస్తున్నారు.

కింగ్​కోఠిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 200 మంది రోగి సహాయకులకు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. కరోనా మొదటి దశలోనూ.. టీఎన్జీవో ఆధ్వర్యంలో 56రోజల పాటు నిత్యావసర సరుకులను, ఆహార ప్యాకెట్లను, మెడికల్ కిట్లను అందజేశామన్నారు.

ఇవీ చూడండి:పన్ను చెల్లింపుదారులకు ఐటీ శాఖ కొత్త పోర్టల్

ABOUT THE AUTHOR

...view details