తెలంగాణ సమాజానికి తన ఉనికిని ఘనంగా చాటిన సంస్థ టీఎన్జీవో అని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. హైదరాబాద్‌లో టీఎన్జీవో డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందే... ఈ సంస్థ తమ పేరులో రాష్ట్రం పేరు పొందుపర్చుకుందని మంత్రి ప్రశంసించారు.
'తమ పేరులోనే తెలంగాణ ఘనతను చాటారు' - టీఎన్జీవో తాజా వార్త
హైదరాబాద్‌లో టీఎన్జీవో సంస్థ డైరీ, క్యాలెండర్‌ను ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ఆవిష్కరించారు. తమ పేరులోనే రాష్ట్రం పేరు పెట్టుకుని తెలంగాణ ఉనికి సమాజానికి తెలిపిన ఘనత టీఎన్జీవో సంస్థదేనని ఆయన కొనియాడారు.
'తమ పేరులోనే తెలంగాణ ఘనతను చాటారు'
ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు భయానక వాతావరణం సృష్టించినా ధైర్యంగా నిలబడి రాష్ట్ర సాధనకు పోరాటం చేశారని గుర్తు చేశారు. టీఎన్జీవోకు కొత్త ఏడాదిలో అంతా శుభమే జరగాలని హరీశ్ రావు ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: పీసీసీ భేటీ... మున్సిపల్ ఎన్నికలపై చర్చ