ఆర్టీసీలో ఉద్యోగ భద్రతపై జీవో విడుదల చేయాలని తెలంగాణ మజ్దూర్ యూనియన్ డిమాండ్ చేసింది. అలాగే ఆర్టీసీ సంస్థలో కార్మిక సంఘాలు ఉండాలో వద్దో రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి అన్నారు. సమ్మె విరమణ తర్వాత అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయని ధ్వజమెత్తారు.
అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి: అశ్వత్థామ రెడ్డి - తెలంగాణ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి
ఆర్టీసీలో కార్మిక సంఘాలు ఉండాలో వద్దో రహస్య ఓటింగ్ ద్వారా నిర్ణయించాలని టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. సమ్మె విరమణ తర్వాత అధికారుల వేధిస్తున్నారని ఆరోపించారు.
అధికారుల వేధింపులు కొనసాగుతున్నాయి
హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ కేంద్ర కమిటీ సమావేశమైంది. ఈ సమావేశానికి అన్ని జిల్లాలకు చెందిన యూనియన్ ప్రతినిధులు, కార్మికులు హాజరయ్యారు. ఆర్టీసీలో యూనియన్ ఎన్నికలు రెండేళ్ల పాటు వాయిదా వేయడం, యూనియన్లకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేయడంపై చర్చించారు. సంతకాలు చేయని వారిని వేధింపులకు గురిచేస్తున్నారని అశ్వత్థామ రెడ్డి ఆరోపించారు.
ఇవీ చూడండి: యాదాద్రిలో కేసీఆర్... ఆలయ పనుల పురోగతిపై ఆరా...