ఆర్టీసీలో సంక్షేమ మండళ్లు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కారిస్తామన్న సీఎం హామీలను.. ఆర్టీసీ యాజమాన్యం పట్టించుకోవడం లేదంటూ టీఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి మండిపడ్డారు.హైదరాబాద్‌లోని తెలంగాణ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆర్టీసీకి వెంటనే పూర్తి స్థాయి ఎండీని నియమించాలని డిమాండ్ చేశారు.
యాజమాన్యం.. గైడ్ లైన్స్‌ను కార్మికుల అభిప్రాయాలకు అనుగుణంగా ఇవ్వాలని అశ్వత్థామ రెడ్డి కోరారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఆర్టీసీ ఉద్యోగులు.. రాష్ట్రం ఏర్పడిన అనంతరం, హక్కులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారంటూ.. పోరాటాలతోనే హక్కులు సాధించుకుంటామని వివరించారు.