తెలంగాణ

telangana

ETV Bharat / state

హుజూర్​ నగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​కు మద్దతిస్తున్నాం: కోదండరాం - huzur nagar news

హుజూర్​నగర్​ ఉపఎన్నికలో కాంగ్రెస్​ పార్టీకి మద్దతిస్తున్నట్లు తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు.  ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు ఈ ఎన్నికలో అధికార పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు.

హుజూర్​ నగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​కు మద్దతిస్తున్నాం: కోదండరాం

By

Published : Oct 2, 2019, 12:52 PM IST

కాంగ్రెస్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. హుజూర్‌నగర్‌లో ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామని ధ్వజమెత్తారు. కొందరి స్వార్థం కోసం ప్రభుత్వం వనరులు కొల్లగొడుతోందని ఆరోపించారు. హుజూర్‌నగర్‌లో సర్పంచులు నామినేషన్లు వేయడానికి వెళ్తే అక్రమంగా అరెస్టు చేశారని వెల్లడించారు. మంత్రివర్గం మొత్తం హుజూర్‌నగర్‌ ఉపఎన్నిక కోసం పనిచేస్తోందని అన్నారు. తెరాసకు సీపీఐ మద్దతు ఇవ్వడం చారిత్రాత్మక తప్పిదమని విమర్శించారు. తమ పద్దతులను పక్కన పెట్టి.. అధికార పార్టీకి బుద్ధి చెప్పేందుకు కాంగ్రెస్​కు మద్దతిస్తున్నట్లు కోదండరామ్‌ తెలిపారు. అనంతరం కాంగ్రెస్​ నేత గూడూరు నారాయణరెడ్డి కోదండరాంకు మిఠాయి తినిపించారు.

హుజూర్​ నగర్​ ఉప ఎన్నికలో కాంగ్రెస్​కు మద్దతిస్తున్నాం: కోదండరాం

ABOUT THE AUTHOR

...view details