పైసల సంస్కృతి పోయి ఓట్లు అడుక్కునే రోజు వచ్చినప్పుడు రాజకీయాలు బాగుపడుతాయని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. అవినీతి అక్రమాలు, ఎన్నికలలో డబ్బుల పంపిణీలపై అన్ని పార్టీలతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన తెలిపారు. ఈ ఎన్నికల్లో 400లకు పైగా బీ ఫారాలు ఇచ్చినట్లు కోదండరామ్ వెల్లడించారు.
'తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నెరవేర్చలేదు' - TJS latest news
మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే పనిచేసే వాళ్లను గెలిపించాలని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరామ్ పిలుపునిచ్చారు. కౌన్సిలర్ల మీద ఒక అంబుడ్స్‌మెన్‌ను నియమించాలని ఆయన అన్నారు.
TJS Release municipal election Manifesto
మున్సిపాలిటీలలో ఈ ఐదేళ్లలో తెరాస ఏమి చేసిందో ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలని కోదండరామ్ డిమాండ్ చేశారు. తెరాస గతంలో ఇచ్చిన హామీ ఒక్కటీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ఇవీ చూడండి: పురపోరుకు 21,850 నామినేషన్లు.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో..
TAGGED:
TJS latest news