ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ అలసత్వం, దళారీ వ్యవస్థ కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కోదండరాం అవేదన వ్యక్తం చేశారు. అన్నదాతల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
రైతుల ఇబ్బందులకు ప్రభుత్వ అలసత్వమే కారణం: కోదండరాం - ప్రో. కోదండరాం తాజా వార్తలు
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు 10 నుంచి 60 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండరాం తెలిపారు. అన్నదాతల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ.. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ లక్ష్మీబాయిని కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు.
ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చిన రైతలు వాటిని అమ్మడానికి కనీసం 10 నుంచి 60 రోజుల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొందని కోదండరాం ఆరోపించారు. గోనె సంచుల కొరత, రవాణా సౌకర్యాలు, హమాలీలు లేకపోవడంతో ధాన్యం కొనుగోల్లు, తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతుందన్నారు. కొనుగోలు కేంద్రాల్లో దోపిడీ కారణంగా ఈ ఏడాది రైతులు దాదాపుగా రూ. 755 కోట్లు నష్టపోయారని తెలిపారు. ధాన్యం క్రయవిక్రయాలకు సంబంధించి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసినా.. రాష్ట్ర స్థాయిలో అవి అమలు కావడంలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:holidays for schools: పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు