తెలంగాణ

telangana

ETV Bharat / state

మున్సిపల్​ ఎన్నికలు వాయిదా వేయాలంటూ కోదండరాం లేఖ - కొవిడ్​ పరిస్థితుల్లో ఎన్నికలు వద్దని కోదండరాం లేఖ

కొవిడ్‌ మహామ్మారి వ్యాప్తి దృష్ట్యా మున్సిపల్ ఎన్నికలు వాయిదా వేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెజస అధ్యక్షుడు కోదండరాం లేఖ రాశారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హైకోర్టు సూచనలను పాటించాలని లేఖలో పేర్కొన్నారు.

TJS President  Kodandaram  writes a letter to SEC
ష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెజస అధ్యక్షుడు కోదండరాం లేఖ

By

Published : Apr 21, 2021, 5:12 AM IST

రాష్ట్రంలో రోజు రోజుకు కరోనా వ్యాప్తి తీవ్రత అధికమవుతున్నందున ఈనెల 30న జరగనున్న మున్సిపల్​ ఎన్నికలు వాయిదా వేయాలని తెజస అధ్యక్షుడు కోదండరాం కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్​కు ఆయన లేఖ రాశారు.

ష్ట్ర ఎన్నికల కమిషన్‌కు తెజస అధ్యక్షుడు కోదండరాం లేఖ

కొవిడ్‌ తీవ్రత దృష్ట్యా ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్లతో పాటు ఐదు మున్సిపాలిటీ ఎన్నికలు వాయిదా వేయాలని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారథికి ఈ మెయిల్‌ ద్వారా ఆయన లేఖను పంపించారు.

ఇదీ చూడండి:ఎంపీ సంతోశ్​ పేరిట నకిలీ ఫేస్​బుక్ అకౌంట్

ABOUT THE AUTHOR

...view details