పెత్తరమావాస్య సందర్భంగా తెలంగాణ అమరవీరులకు తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం బియ్యం సమర్పించారు. హైదరాబాద్ గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద పూజలు నిర్వహించి బియ్యం ఇచ్చారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని కోదండరాం కొనియాడారు.
తెలంగాణ అమరులకు బియ్యం సమర్పించిన కోదండరాం - tjs president kodandaram
హైదరాబాద్ గన్‌పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం పూజలు నిర్వహించి అమరవీరులకు బియ్యం సమర్పించారు. అమరుల ఆశయాల సాధన కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: కోదండరాం
అమరుల త్యాగాలు మర్చిపోతే తెలంగాణ తమను తాము మర్చిపోయినట్లేనని అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ప్రభుత్వం మాత్రం పూల మొక్కల మీద సమీక్ష చేస్తోందని మండిపడ్డారు. అమరుల ఆశయాల సాధన కోసం నిరంతరం పోరాడుతామని స్పష్టం చేశారు.
ఇవీ చూడండి: వరద ప్రభావిత ప్రాంతాల్లో బండి సంజయ్ పర్యటన