తెలంగాణ

telangana

ETV Bharat / state

'మెట్రో నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి' - metro train project in Hyderabad

ప్రభుత్వం హైదరాబాద్‌కు మణిహారంగా చెప్పుకుంటున్న మెట్రో నిర్మాణంపై పూర్తి సమాచారంతో శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌ డిమాండ్‌ చేశారు. ఆర్టీసీకి డబ్బులు లేవని చెప్పిన ప్రభుత్వం.. మెట్రోకు రూ. 2 వేల కోట్ల వయబులిటి ఎలా ఇస్తుందని హైదరాబాద్​లో ప్రశ్నించారు.

tjs president kodandaram speak about metro  in Hyderabad
'మెట్రో నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

By

Published : Feb 6, 2020, 9:15 PM IST

మెట్రో నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదండరామ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు జేబీఎస్‌ నుంచి ఎంజీబీఎస్‌ వరకు ఉన్న 11 కి.మీ లైన్‌ను ప్రారంభిస్తున్నందున... మెట్రో నిర్మాణంపై సమాచారం ప్రజలకు తెలియజేయాల్సిన అవసరముందన్నారు. ఆర్టీసీకి డబ్బులు లేవని చెప్పిన ప్రభుత్వం.. మెట్రోకు రూ. 2 వేల కోట్ల వయబులిటి ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు.

'మెట్రో నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేయాలి'

ABOUT THE AUTHOR

...view details