హైదరాబాద్లోని తెజస కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు కోదండరాం మౌన దీక్షకు దిగారు. ప్రజా సమస్యలను మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లేందుకు మౌనదీక్ష చేస్తున్నట్లు చెప్పారు. ప్రజల ఆరోగ్యానికి పెను ప్రమాదం ఏర్పడిందన్నారు. పేదలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. జనాల ఇబ్బందులను సీఎస్, గవర్నర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. ప్రతి కుటుంబానికి నిత్యావసరాలు ఉచితంగా ఇవ్వాలని కోరారు. కీలక సమయంలో పీపీఈ కిట్లు కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు.
'క్లిష్ట పరిస్థితుల్లో పీపీఈ కిట్లు కొనలేని దుస్థితి' - hyderabad latest news
ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్లో తెజస అధ్యక్షుడు కోదండరాం మౌన దీక్ష చేపట్టారు. ప్రజల ఇబ్బందులు మంత్రివర్గ దృష్టికి తీసుకెళ్లేందుకు దీక్ష చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజా సమస్యలు పరిష్కరించాలంటూ కోదండరాం దీక్ష