తెలంగాణ

telangana

ETV Bharat / state

అక్రమాలపై ప్రశ్నిస్తే.. జైల్లో పెడుతున్నరు: కోదండ రాం - ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్​ను ఖండించిన తెజస

మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్​ను ఖండిస్తున్నట్లు తెజస అధ్యక్షుడు ప్రొ. కోదండ రాం తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తే... అరెస్ట్ చేసి జైల్లో పెట్టడమేంటని ప్రశ్నించారు.

kodanaram responds revanth reddy arrest issue
'ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్​ను ఖండిస్తున్నాం...'

By

Published : Mar 10, 2020, 12:41 PM IST

Updated : Mar 10, 2020, 2:31 PM IST

ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్​ను తెజస ఖండిస్తున్నట్లు ఆ పార్టీ ఆధ్యక్షుడు ప్రొ. కోదండ రాం వెల్లడించారు. ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టినందుకు ప్రశ్నిస్తే... అరెస్ట్ చేయడం శోచనీయమన్నారు. ఐదేళ్లలో 60 వేలమంది ఉద్యోగ విరమణ చేశారని... ఖాళీ అయిన పోస్టులను ప్రభుత్వం ఇప్పటివరకు భర్తీ చేయలేదని కోదండరాం మండిపడ్డారు.

ఐదేళ్లలో కేవలం 35 వేల పోస్టులు మాత్రమే భర్తీ చేశారని తెలిపారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి... నిరుద్యోగ సమస్య మా చేతుల్లో లేదని.. దాన్ని తాము పరిష్కరించలేమని చెప్పడం అన్యాయమన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం వద్ద ఏమైనా విధానం ఉందా..? అని కోదండ రాం ప్రశ్నించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తామని... త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని వెల్లడించారు.

'ఎంపీ రేవంత్ రెడ్డి అరెస్ట్​ను ఖండిస్తున్నాం...'

ఇవీ చూడండి:తెలంగాణ నేలపై డైనోసార్​లు

Last Updated : Mar 10, 2020, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details