రాష్ట్రంలో అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదని... అందులో ప్రజల భాగస్వామ్యం ఉండాలని వ్యాఖ్యానించారు.
అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన: కోదండరాం - tjs president kodandaram speech
అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ఆచార్య కోదండరాం.. ట్యాంక్బండ్పైన ఉన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ స్ఫూర్తికి విరుద్ధంగా పాలన కొనసాగుతుందని అన్నారు.
కోదండరాం
అంబేడ్కర్ 130వ జయంతి సందర్భంగా ట్యాంక్బండ్పైన ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి... నివాళులర్పించారు. ప్రస్తుతం ఎన్నికల్లో చాలా వరకు మార్పులు ఉన్నాయని వెల్లడించారు. పూర్తిస్థాయి అంబేడ్కర్ ఆశయాల కోసం కృషి చేయాలని కోదండరాం అన్నారు. ప్రభుత్వం హడావిడిగా ప్రైవేటు యూనివర్శిటీల బిల్లు తీసుకువచ్చిందని విమర్శించారు. అంబేడ్కర్ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రానికి వెలుగునిచ్చిన స్ఫూర్తిగా ఆయన వివరించారు.