Kodandaram on TRS: నోటిఫికేషన్ల విడుదలలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తోందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఉద్యోగ ప్రకటన చేసి నెల దాటినా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం గెజిట్ అమల్లోకి వస్తే కృష్ణా జలాలపై రాష్ట్రం పూర్తిగా హక్కులు కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మే 4వ తేదీ నుంచి కృష్ణా జలాల సాధన యాత్ర చేస్తామని ఆయన ప్రకటించారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెరిగిన ధరలతో పేదలు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కోదండరాం విమర్శించారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేశారు. పెంచిన విద్యుత్ చార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలని కోరారు. ధరల పెరుగుదలను నిరసిస్తూ ఈ నెల 25, 26 తేదీలలో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
ప్రగతిభవన్ కేంద్రంగా కాంట్రాక్టర్ల కమీషన్ దందా నడుస్తోంది. గుత్తేదార్లకు టోకెన్ వ్యవస్థను అమలు చేయాలి. నిధుల దుర్వినియోగం, నీళ్ల సాధనలో ప్రభుత్వం నిర్లక్ష్యం కనపడుతోంది. మే 4 నుంచి కృష్ణా జలాల సాధన యాత్ర చేస్తాం. సాయిగణేష్ ఆత్మహత్యకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పువ్వాడ రాజీనామా చేయాలి. నోటిఫికేషన్ల విడుదలలో ప్రభుత్వం ఉద్దేశపూర్వక జాప్యం చేస్తోంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తేవాలి. పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణం ఉపసంహరించుకోవాలి.
- కోదండరాం, తెలంగాణ జనసమితి అధ్యక్షుడు