ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు అసత్యమైనవని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 2015లో అసెంబ్లీ సాక్షిగా లక్షా 7వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రకటించారని తెలిపారు. ఈ పోస్టులను ఏడాదిలో భర్తీ చేస్తామన్న కేసీఆర్ ఆరున్నరేళ్లలో కేవలం 70వేలే భర్తీ చేశారని ఇంకా 30వేలు ఖాళీగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఇటీవల పీఆర్‌సీ నివేదిక ప్రకారం రాష్ట్రంలో లక్షా 91వేల ఖాళీలు ఉన్నాయన్న ఆయన... లక్షా 32 వేల 799 ఉద్యోగాలు భర్తీ చేశామన్న కేటీఆర్ అసత్య ప్రకటనను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వ లెక్కలు అసత్యం: కోదండరాం - telangana varthalu
ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని తెజస అధ్యక్షుడు కోదండరాం సవాల్ విసిరారు. ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు అసత్యమైనవని ఆయన అన్నారు. పీఆర్‌సీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ తప్పుడు ప్రకటనలను నమ్మవద్ధని నిరుద్యోగ యువతకు విజ్ఞప్తి చేశారు. పదోన్నతులు, క్రమబద్ధీకరణలు, పబ్లిక్ రంగ సంస్థల ఉద్యోగాలు 2015లో చెప్పిన లెక్కలోకి రావన్నారు. పీఆర్‌సీ నివేదిక ప్రకారం ఖాళీగా ఉన్న లక్షా 91వేల ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. బకాయిపడ్డ నిరుద్యోగ భృతి చెల్లించిన తరువాత ఓట్లు అడగాలని హితవు పలికారు. ఉద్యోగాల భర్తీపై కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని కోదండరాం సవాల్ విసిరారు.
ఇదీ చదవండి: కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాలి: హైకోర్టు