తెలంగాణ

telangana

ETV Bharat / state

ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: కోదండరామ్ - Trs president kodandaram latest news

నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య దోరణి, అలసత్వం కారణంగా బోడ సునీల్‌ ఆత్మహత్య చేసుకున్నారని తెజస అధ్యక్షుడు కోదండరామ్ ఆరోపించారు. సునీల్​ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనన్నారు.

tjs
సునీల్ చావుపై కోదండారామ్ స్పందన

By

Published : Apr 2, 2021, 9:06 PM IST

బోడ సునీల్‌ చావుకు కారణమైన ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ డిమాండ్‌ చేశారు. సునీల్‌ చావుతోనైనా అందరూ కళ్లు తెరవాలని... ఉద్యోగ సాధన కోసం ఐక్యంగా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో లక్షా 90 వేల ఉద్యోగులు ఖాళీగా ఉన్నాయన్న ప్రభుత్వం... ఉద్యోగాలు భర్తీ చేయాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసిన పట్టించుకోలేదని మండిపడ్డారు.

ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసి ఉంటే ఇలాంటి చావులు చూడాల్సి వచ్చేదికాదన్నారు. నిరుద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య దోరణి, అలసత్వం కారణంగా సునీల్‌ ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. సునీల్‌ది ఆత్మహత్య కాదని... ఇది ముమ్మాటి హత్యేనన్నారు. బోడ సునీల్‌ ఆత్మహత్యను నిరసిస్తూ...ఆందోళన చేసిన వారిని అరెస్ట్‌ చేశారని... వారిని వెంటనే విడుదల చేయాలన్నారు. నిరుద్యోగులు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

ఇదీ చూడండి:కేయూ విద్యార్థి సునీల్ నాయక్​ది ప్రభుత్వ హత్యే: రేవంత్

ABOUT THE AUTHOR

...view details