ప్రభుత్వం సన్నరకం వరి పండించాలంటూ వ్యవసాయాన్ని, ఎల్ఆర్ఎస్ పేరుతో రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీసిందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ఆధ్వర్యంలో డిసెంబర్ 9 చారిత్రక సందర్భం, ప్రస్తుత పరిస్థితులు-భవిష్యత్ కార్యాచరణ అనే అంశంపై నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి: కోదండరాం - ప్రభుత్వంపై మండిపడ్డ కోదండరాం వార్తలు
తెలంగాణలో అంతరించిపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని తెజస అధ్యక్షుడు కోదండరాం పేర్కొన్నారు. రాష్ట్రంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి: కోదండరాం
తెలంగాణ ఉద్యమ అస్థిత్వం కోసం చేసిన పోరాటమని కోదండరాం వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా లేదని.. అంతరించిపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అన్నారు.
ఇదీ చూడండి: కొత్త అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది: మాణిక్కం ఠాగూర్