తెరాస నిరంకుశ ధోరణికి పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు గిట్టుబాటు ధర అందడం లేదని హైదరాబాద్లో విమర్శించారు. ముఖ్యంగా నిజామాబాద్ రైతులు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచారని ప్రశంసించారు. ఉద్యోగాల భర్తీలో కూడా సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపించారు. పరీక్షలు నిర్వహించి... ఫలితాల విడుదల చేయకపోవడం, నియామకాలు పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారని అన్నారు. అటవీ హక్కుల చట్టం కోసం ఏటూరు నాగారంలో త్వరలో బహిరంగ సభ నిర్వహిస్తామని తెలిపారు. నిరుద్యోగులు, రైతు సమస్యలపై తమ పోరాటం ఉద్ధృతం చేస్తామని స్పష్టం చేశారు.
'తెరాస నిరంకుశ ధోరణికి ప్రజలు బుద్ధి చెప్పారు' - కోదండరాం ప్రెస్ మీట్
తెరాస ప్రభుత్వ నిరంకుశ ధోరణి వల్లే ఎంపీ ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురైందని తెజస అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసి నిజామాబాద్ రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్న ఆయన... అన్నదాతలు, నిరుద్యోగుల సమస్యలపై తమ పోరాటం ఉద్ధృతం చేస్తామని తెలిపారు.
కోదండరాం