అనేకమంది అమరవీరుల పోరాటాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి ఆయన నివాళులర్పించారు. రాష్ట్రంలో సీఎం దర్శనభాగ్యం ప్రజలకు కలగడం లేదన్న ఆయన... సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు.
ఉద్యమకారుల ఆశయాలకు భిన్నంగా తెరాస పాలన: కోదండరాం - గన్ పార్కు వద్ద కోదండరాం నివాళులు
రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ఉద్యమకారుల ఆశయాలకు భిన్నంగా పాలకులు ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కోదండరాం గన్‌పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు.
హైదరాబాద్ గన్‌పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి కోదండరాం నివాళులు
ఉద్యమకాలంలో ఆశించిన తెలంగాణ ఏర్పాటు కావాల్సిన అవసరముందని కోదండరాం ఆకాంక్షించారు. ఎంతో మంది ప్రాణత్యాగాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించిందన్న కోదండరాం... ఇవాళ కూడా బతుకుదెరువు కోసం ప్రజలు ఆత్మహత్యకు పాల్పడటం శోచనీయమన్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా... పార్టీ కార్యాలయంలో ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించారు.