రాష్ట్రంలో బలవంతపు భూ సేకరణ వల్ల వందలాది మంది బతుకు దెరువు కోల్పోయారని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష ఎకరాల వరకు సేకరించారని పేర్కొన్నారు. మల్లన్నసాగర్, నిమ్జ్, ఫార్మాసిటీ, టెక్స్‌టైల్ పార్క్, రోడ్డు విసర్తణలో భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులతో నాంపల్లి తెజస కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి ముఖ్య అతిథిగా పర్యావరణ వేత్త బాబురావు హాజరయ్యారు. కేసీఆర్ ఫామ్‌హౌస్‌లో... ప్రభుత్వం ఒక్క ఎకరం కూడా ఎందుకు సేకరించలేదని కోదండరాం ప్రశ్నించారు.
భూ నిర్వాసితులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన కోదండరాం - కోదండరాం రౌండ్ టేబుల్ సమావేశం
తెరాస అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సేకరణ పెరిగిపోయిందని తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. వైకుంఠదామాలు, రైతు వేదికల పేరుతో అడ్డగోలుగా భూములు గుంజుకున్నారని మండిపడ్డారు. మల్లన్నసాగర్, నిమ్జ్, ఫార్మాసిటీ, టెక్స్‌టైల్ పార్క్, రోడ్డు విసర్తణలో భూమి కోల్పోతున్న భూ నిర్వాసితులతో గురువారం నాంపల్లి తెజస కార్యాలయంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
kodamdaram
అభివృద్ధి పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పర్యావరణ వేత్త బాబురావు అన్నారు. ప్రైవేట్ కంపెనీలు పెడుతున్నప్పుడు ప్రభుత్వం భూమి ఎందుకు సేకరిస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. కంపెనీలు రైతుల భూములనే పెట్టుబడిగా పెడుతున్నాయని ఆరోపించారు. అందరం కలిసి పోరాడితేనే బలవంతపు భూ సేకరణ ఆగుతోందన్నారు.
ఇదీ చూడండి:కరోనా తీవ్రతరం.. ఆస్పత్రుల్లో పడకల కొరత