కరోనా దృష్టి మరల్చేందుకే ఈటల వ్యవహారాన్ని తెరపైకి తీసుకొచ్చారని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. మంత్రి ఈటల గట్టిగా మాట్లాడినందుకే విచారణ జరుపుతున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టేందుకు సిద్ధమని ఆయన ప్రకటించారు. కేసీఆర్‌ను గద్ధె దించేందుకు ఉద్యమకారులంతా ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
కరోనా దృష్టి మరల్చడానికే ఈటల వ్యవహారం: కోదండరాం - ఈటల వ్యవహారంపై కోదండరాం
సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టడానికి సిద్ధమని తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం అన్నారు. మంత్రి ఈటలతో పాటు కేటీఆర్, మల్లారెడ్డిపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈటలతో పాటు మంత్రులు కేటీఆర్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి, మంచిరెడ్డి, మహిపాల్‌రెడ్డిపై విచారణ జరపాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రత్యర్థులను లొంగదీసుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. హఫీజ్‌పేట్, మియాపూర్ భూములపై విచారణ జరపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళనలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కోదండరాం మండిపడ్డారు. కేటీఆర్ భూమి ఆక్రమించి ఫామ్‌హౌస్ కట్టుకున్నాడని... ఆరోపణలు వచ్చినప్పుడు ఎందుకు దర్యాప్తు చేయలేదని ప్రశ్నించారు.