తెలంగాణ

telangana

ETV Bharat / state

చెరుకు సుధాకర్​తో కోదండరాం భేటీ... ఎందుకంటే..? - తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వార్తలు

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం... తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చెరుకు సుధాకర్​తో భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.

చెరుకు సుధాకర్​తో కోదండరాం భేటీ... ఎందుకంటే..?
చెరుకు సుధాకర్​తో కోదండరాం భేటీ... ఎందుకంటే..?

By

Published : Sep 23, 2020, 7:52 PM IST

పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని తెజస పార్టీ అధ్యక్షుడు కోదండరాం తమను కోరారని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ అన్నారు. హైదరాబాద్ ఆదర్శనగర్​లోని ఇంటి పార్టీ కార్యాలయంలో కోదండరాం, చెరకు సుధాకర్​ భేటీ అయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించారు.

నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు మద్దతు ఇవ్వాలని కోదండరాం కోరగా... తాను సున్నితంగా తిరస్కరించినట్లు తెలిపారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్​నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని తెజసకు సూచించినట్లు పేర్కొన్నారు. కోదండరాం ఏ నిర్ణయం తీసుకున్నా.. తాను మాత్రం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీలో ఉంటానని చెరుకు సుధాకర్​ స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:'దుబ్బాకను సస్యశ్యామలం చేయడమే లక్ష్యం'

ABOUT THE AUTHOR

...view details