ప్రభుత్వం బలవంతంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి.. కరోనా వ్యాప్తికి కారణమైందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. ఒక్క వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన 10 మంది సిబ్బంది కరోనాతో మృతి చెందారని పేర్కొన్నారు. మరో 50 మంది చికిత్స పొందుతున్నారని తెలిపారు.
ప్రభుత్వ తీరు వల్లే ఎన్నికల సిబ్బందికి కరోనా: కోదండరాం - ఎన్నికల సిబ్బందికి వైరస్
మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి కొవిడ్ వ్యాప్తికి సర్కారే కారణమైందని తెజస అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. వరంగల్‌లో విధులు నిర్వర్తించిన 10 మంది సిబ్బంది కరోనాతో మృతి చెందారని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ఇచ్చిన హెల్త్‌కార్డులు పనిచేయడం లేదని విమర్శించారు. ఎంజీఎంలో పడకలు లేక ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తే లక్షలు వెచ్చించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ధోరణి వల్ల ఉద్యోగుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని కోదండరాం ఆరోపించారు. తెరాస ప్రభుత్వమే మృతులు, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులను ఫ్రంట్‌లైన్ వారియర్స్‌గా గుర్తించి అన్ని విధాలుగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దిల్లీ ప్రభుత్వం సిబ్బందితో పాటు కరోనాతో చనిపోయిన ప్రజలందరికీ ఆసరాగా నిలిచిందన్నారు.