ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెజస అధ్యక్షుడు ప్రొ.కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రభుత్వోద్యోగుల వయోపరిమితి పెంచడం సమంజసం కాదన్నారు.
ఆత్మహత్యలు వద్దు... ఐక్యంగా పోరాడదాం..! - విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవద్దన్న కోదండరాం
ఉద్యోగ నోటిఫికేషన్లు రాక.. కొలువు వస్తుందన్న ఆశ నశించి యువత ఆందోళనలో ఉంటే.. ప్రభుత్వం ప్రభుత్వోద్యోగుల వయోపరిమితి పెంచిందని తెజస అధ్యక్షుడు కోదండరాం మండిపడ్డారు. ఇది యువతను తీవ్ర నిరాశ పరిచిందన్నారు.
kodamdaram, tjs, dont suicide
ఉద్యోగం ఎప్పుడొస్తుందోనని మనస్తాపంతో కాకతీయ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి బోడ సునీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఆత్మహత్య ప్రయత్నాలు జరగకుండా ప్రభుత్వం కదలాలని హితవు పలికారు. యువత ఆత్మహత్య నిర్ణయాలు తీసుకోరాదని అందరం కలిసి ఐక్యంగా పోరాడదామని పిలుపునిచ్చారు.