ప్రతి జిల్లాలో కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు తెజస అధ్యక్షుడు కోదండరాం. ఇవాళ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెజస జెండాను ఎగురవేశారు. కరోనా ప్రభావం తగ్గిన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులపై చర్చిస్తామన్నారు. త్వరలో అఖిలపక్షంగా సీఎస్ సోమేశ్‌కుమార్‌ను కలుస్తామని తెలిపారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సూచించారు. పార్టీ పరంగా భూ సమస్యలపై పెద్దఎత్తున పోరాటం చేసినట్లు వివరించారు. కార్పొరేట్ విద్యకు వ్యతిరేకంగా అనేక ఆందోళనలు చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరకులు అందజేశారు.
సాదాసీదాగా తెజస వార్షికోత్సవం - నాంపల్లిలో తెజస ఆవిర్భావ వేడుకలు
నాంపల్లిలో తెలంగాణ జన సమితి ఆవిర్భావ వేడుకల్లో పార్టీ అధ్యక్షుడు కోదండరాం పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన పార్టీ జెండాను ఎగురవేశారు.
'ప్రతి జిల్లా కేంద్రంలో కరోనా పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి'