తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలపై విస్తృతంగా చర్చించి భవిష్యత్తులో తెజస చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు కోదండరాం తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో తెజస ప్రథమ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలోని నాగోలు శుభం కన్వెన్షన్ హాలులో ప్లీనరీ జరుగుతుందన్న... దిల్లీ నుంచి ఆచార్య యోగేంద్రయాదవ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆరు అంశాలపై తీర్మానాలు చేస్తామన్నారు.
నేడు తెలంగాణ జన సమితి ప్రథమ ప్లీనరీ - నేడు ప్రారంభం
నేడు తెలంగాణ జన సమితి ప్రథమ ప్లీనరీ సమావేశం జరుగనుంది. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం గురించి విస్తృతంగా చర్చించి భవిష్యత్తులో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ రూపొందిస్తున్నట్లు అధ్యక్షుడు కోదండరాం తెలిపారు.
తెజస ప్రథమ ప్లీనరీ...నేడు మొదలు
ఒకటి పార్టీ నిర్మాణానికి సంబంధించిన తీర్మానం కాగా.. మిగతా ఐదు వ్యవసాయం, విద్య, వైద్యం, ఉద్యోగం, సామాజిక న్యాయం అంశాలపై ఉంటాయన్నారు. ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యామన్నారు. నిజమైన బాహుబలులు ప్రజలేనని ఆయన స్పష్టం చేశారు. సమావేశంలో పార్టీ నేతలు పీఎల్ విశ్వేశ్వర్‌రావు, శంకర్, పాండురంగారావు, రమేశ్‌రెడ్డి, బద్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కిషన్ రెడ్డి ఓఎస్డీగా ఆమ్రపాలి..!
Last Updated : Jul 13, 2019, 7:21 AM IST