తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఎన్నికల్లో తెరాస అక్రమాలపై విచారణ జరిపించండి' - కేంద్ర ఎన్నికల కమిషన్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెరాస అక్రమాలకు పాల్పడిందని తెజస ఆరోపించింది. ఓటర్లకు డబ్బుల పంపీణిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని.. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది.

Tjs alleges that Trs Abuses power in the MLC elections
'ఎన్నికల్లో తెరాస అక్రమాలపై విచారణ జరిపించండి'

By

Published : Mar 15, 2021, 9:52 PM IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. తెరాస అధికార దుర్వినియోగానికి పాల్పడిందని తెజస రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రొ.విశ్వేశ్వరరావు ఆరోపించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలు, డబ్బుల పంపీణిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని.. రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్​కు ఆయన ఫిర్యాదు చేశారు.

ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశామని ప్రొ.విశ్వేశ్వరరావు పేర్కొన్నారు. త్వరలోనే.. విచారణ ప్రారంభిస్తామని ఎన్నికల అధికారి తెలిపినట్లు ఆయన వివరించారు.

ఇదీ చదవండి:ప్రభుత్వం హామీ ఇచ్చింది.. విచారణ అవసరం లేదు: హైకోర్టు

ABOUT THE AUTHOR

...view details