తెలంగాణలోని రైతులు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేలా తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టీ. కన్సల్ట్ యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. వ్యవసాయంలోని అన్ని సమస్యలపై సమగ్ర అవగాహన, సమస్యలకు పరిష్కారాలు పొందేందుకు రైతులను శాస్త్రవేత్తలతో అనుసంధానం చేసేలా ఈ యాప్ సహకరిస్తుందని మంత్రి వెల్లడించారు.
టీ కన్సల్ట్ యాప్‌ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి - టీ కన్సల్ట్ యాప్‌ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి
తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) రూపొందించిన టీ. కన్సల్ట్ యాప్‌ను వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్నదాతలు వ్యవసాయంలో కొత్త పుంతలు తొక్కేందుకు టీ కన్సల్ట్ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
టీ కన్సల్ట్ యాప్‌ను ప్రారంభించిన మంత్రి సింగిరెడ్డి
ఇందుకోసం తెలంగాణ వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలతో టీటా చర్చలు జరిపింది. తెలంగాణ వ్యవసాయ వర్సిటీ మాజీ రిజిస్ట్రార్ జలపతిరావుతో టీ కన్సల్ట్ ద్వారా రైతులకు సంబంధించిన సందేహాలను అడిగి తెలుసుకున్నారు. టీ కన్సల్ట్ యాప్ ద్వారా రైతులకు మరింత చేరువ కావాలని మంత్రి ఆకాంక్షించారు.
ఇదీ చూడండి :రాష్ట్రంలో 42 వేలు దాటిన కరోనా కేసులు.. 400పైగా మరణాలు