హైదరాబాద్ టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ క్యాంపస్ లో వసతి గృహ ఫీజులను వెంటనే తగ్గించాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఇటీవల వసతి గృహాన్ని రాజేంద్రనగర్ నుంచి బ్రాహ్మణపల్లికి మార్చి... నిర్వహణను ప్రైవేటు సంస్థకు ఇవ్వడం వల్ల ఇబ్బందులు పడుతున్నామన్నారు. కొత్త వసతి గృహంలో సరైన భద్రత సౌకర్యాలు లేవని ఆరోపించారు. ఇటీవల హస్టల్ ఆహారం తిని పలువురు విద్యార్థులు అస్వస్థత చెందినట్లు తెలిపారు. దీనిపై కళాశాల, హాస్టల్ నుంచి సరైన స్పందన లేదని వాపోయారు. వారం రోజులుగా నిరసన తెలుపుతున్నా... ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా యూజీసీ, కళాశాల యాజమాన్యం స్పందించి పాత వసతి గృహ విధానాన్ని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
హాస్టల్ ఫీజులు తగ్గించాలని ఆందోళన - విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ లోని టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ క్యాంపస్ విద్యార్థులు హాస్టల్ ఫీజులను తగ్గించాలని నిరసన వ్యక్తం చేశారు. యూజీసీ నిబంధనలకు అనుగుణంగా పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. కొత్త వసతిగృహంలో సౌకర్యాల లేమితో చాలా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళన