శ్రీవారి దర్శనం కోసం వచ్చి.. లాక్డౌన్ కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతికి అండగా పలువురు దాతలు ముందుకొచ్చారు. 78వేల 500 రూపాయల విరాళాన్ని.... తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా చేతుల మీదుగా ఈనాడు యాజమాన్యం ఎస్తేర్కు అందచేసింది. దీంతో ఇప్పటివరకూ ఆమెకు అందిన విరాళాలు 2లక్షల రూపాయలకు చేరుకున్నాయి.
రష్యన్ యువతికి అండగా.. ముందుకొచ్చిన పలువురు దాతలు - రష్యన్ మహిళా కష్టాలు న్యూస్
తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చి..కరోనా లాక్ డౌన్ కారణంగా తిరుపతిలో చిక్కుకుపోయిన రష్యన్ యువతి ఎస్తేర్పై ఈనాడు- ఈటీవీ భారత్ ప్రసారం చేసిన కథనానికి స్పందన వెల్లువెత్తుతూనే ఉంది. ఆమెను ఆదుకునేందుకు మానవత్వంతో పలువురు స్పందిస్తున్నారు.
ఎస్తేర్ పడుతున్న కష్టాలపై ఈనాడు-ఈటీవీ కథనాలు వెలుగులోకి తీసుకువచ్చాయన్న కమిషనర్..... ఆమె తన తల్లితో రష్యాకు తిరిగి వెళ్లేంతవరకూ నగరపాలక సంస్థ తరఫున సహాయ సహకారాలు అందిస్తామన్నారు. వారు కోరుకుంటే నగరపాలక సంస్థ వసతిగృహాన్ని ఆతిథ్యం కోసం కేటాయిస్తామన్నారు. తన కష్టాలపై స్పందించి... విరాళాలు పంపిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపిన ఎస్తేర్.. తన తల్లిని కలిసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
సంబంధిత కథనం :తిరుపతిలో రష్యన్ మహిళ కష్టాలు.. ఆర్థిక సమస్యలతో తల్లీకుమార్తెలు అవస్థ