తిరుమలలో మరో చిన్నారి అదృశ్యం తిరుమలలో మరో అదృశ్యం కేసు కలకలం రేపింది. కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటన జరిగింది. పోలీసులు చాలా వేగంగా స్పందించి రోజుల వ్యవధిలోనే నిందితులను పట్టుకున్నారు. ఇప్పుడూ అలాంటి కేసు మరొకటి నమోదైంది.
ఇన్నాళ్లూ దర్శనానికి వచ్చిన భక్తుల పిల్లలే అదృశ్యమయ్యేవారు. ఇప్పుడు ఏకంగా అక్కడ వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి కుమారుడినే గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారు. రాత్రి అంతా కలిసే నిద్రపోయామని... ఉదయాన్నే లేచి చూసేసరికి తమ చిన్నారి కనిపించడం లేదని తమిళనాడుకు చెందినదంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
తమిళనాడు విల్లుపురానికి చెందిన మహావీర్, కౌశల్య దంపతులు కొన్ని రోజులుగా తిరుమలలో నివాసం ఉంటున్నారు. చిరువ్యాపారం చేసుకొని జీవిస్తున్నారు. వీరికి మూడు నెలల బాలుడు వీరేష్ ఉన్నాడు. రాత్రికిరాత్రే తమ చిన్నారిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకుపోయారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎంత వెతికినా ప్రయోజనం లేకుండా పోయిందనిపేర్కొన్నారు.
వెంటనే కేసు నమోదు చేసుకున్న పోలీసులు... విచారణచేపట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. గత నేరస్థులవివరాలు ఆరా తీస్తున్నారు. అధైర్యపడొద్దని బిడ్డను వెతికి పట్టుకుంటామని ఆ కన్నవారికి భరోసా ధైర్యం చెబుతున్నారు.
తిరుమలలో అప్పడుప్పుడు జరుగుతున్న అపహరణ కేసులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా... ఈ కిడ్నాప్లకు అడ్డుకట్ట పడటం లేదని భక్తులు వాపోతున్నారు.
ఇవీ చూడండి:భద్రాద్రి ఆలయంలో భక్తుల రద్దీ