TTD TICKETS: నేటి నుంచి ఉదయాస్తమాన సేవాటికెట్ల మంజూరు - ttd latest updates
TTD TICKETS: ఖాళీ అయిన 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంచారు. శుక్రవారమైతే రూ.1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ.కోటి దాతలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది.

TTD TICKETS: ఖాళీ అయిన 531 ఉదయాస్తమాన సేవా టికెట్లను దాతలకు అందుబాటులో ఉంచారు. శుక్రవారమైతే రూ.1.5 కోట్లు, మిగిలిన రోజుల్లో రూ.కోటి దాతలు విరాళంగా ఇవ్వాల్సి ఉంటుంది. తిరుపతిలో చిన్నపిల్లల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి తితిదే దాతల నుంచి విరాళాలు ఆహ్వానిస్తోంది. ఇందుకోసం బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆన్‌లైన్‌లో విరాళాల స్వీకరణ ప్రారంభమవుతుంది. తితిదే వెబ్‌సైట్ https://tirupatibalaji.ap.gov.in ద్వారా దాతలు విరాళాలు సమర్పించవచ్చు. మరోవైపు తిరుమల ఆకాశగంగ సమీపంలో హనుమాన్ జన్మస్థలం అభివృద్ధికి బుధవారం భూమిపూజ జరగనుంది. అందులో భాగంగా ఆకాశగంగలోని శ్రీ అంజనాదేవి సమేత శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయంతోపాటు పరిసర ప్రాంతాలను పూలు, విద్యుద్దీపాలతో ముస్తాబు చేశారు.