హైదరాబాద్ బహదూర్పురా పశువుల కమేలకు రెండు చిన్న లేగదూడలను తరలిస్తున్నారు కొందరు వ్యక్తులు. విషయం గుర్తించిన తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు తిరుపతి వారిని ఆపి... వాటిని వదిలేయమని కోరాడు. జీవహింస పాపమంటూ హితబోధ చేసే ప్రయత్నం చేశాడు.
లేగదూడలను కొని గోశాలకు తరలింపు.. - తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు తిరుపతి
కబేళాలకు తరలిస్తున్న లేగదుడలను కొనుగోలు చేసి గోశాలకు తరలించాడు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు తిరుపతి. ప్రభుత్వం పశువులను కాపాడేందుకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వీటి అక్రమ రవాణా మాత్రం ఆగడం లేదు.
![లేగదూడలను కొని గోశాలకు తరలింపు.. ttd trust member saved two cows](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8253595-560-8253595-1596267668634.jpg)
లేగదూడలను కొని గోశాలకు తరలింపు..
అయినప్పటికీ వారు వినకపోవడం వల్ల ఆ లేగదూడలను తనకు అమ్మాలని కోరాడు. మొత్తం రెండు లేగదూడలకు కలిపి 25 వేలు ఇచ్చి వాటిని కొనుగోలు చేశాడు. అనంతరం వాటిని గండిపేట మండలం నార్సింగి ప్రాంతంలోని గోశాలలో వదిలేశాడు. ప్రభుత్వం పశువుల అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ... ఫలితం లేకుండా పోతోంది. ఇప్పటికైనా మరిన్ని కఠిన చర్యలు తీసుకొని గోవులకు కాపాడాలని తిరుపతి కోరారు.