దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుమల శ్రీవారి ఆలయం రెండో స్థానంలో నిలిచిందని ఓయో కల్చరల్ ట్రావెల్ రిపోర్టు వెల్లడించింది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా భక్తులు చూసిన దర్శనీయ, పర్యాటక ప్రాంతాలపై సర్వే నిర్వహించింది. ఇందులో వారణాసి మొదటి స్థానాన్ని దక్కించుకోగా, తిరుమల రెండో స్థానంలో నిలిచిందని సంస్థ పేర్కొంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కరోనా ఆంక్షలను ప్రభుత్వం సడలించడంతో తిరుమల భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది. పర్యాటకుల గదుల బుకింగ్ తిరుపతి నగరంలో గతేడాదితో పోలిస్తే ఈసారి 233 శాతం పెరిగింది. వారణాసి, శిర్డీ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
అత్యధికంగా భక్తులు సందర్శించిన ఆలయాల్లో తిరుమలకు రెండో స్థానం - వైకుంఠ ద్వార దర్శనం
దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో తిరుపతి ఎంతో ప్రసిద్ధమైంది. తాజాగా అది మరో ఘనత దక్కించుకుంది. దేశంలోనే అత్యధికంగా భక్తులు సందర్శించిన క్షేత్రంగా రెండో స్థానంలో నిలిచింది.
VAIKUNTA EKADASI : శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు టైం స్లాట్ టోకెన్లు పొంది తిరుమలకు రావాలని.. తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ విజ్ఞప్తి చేశారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. వైకుంఠ ద్వార దర్శనం జనవరి 2 నుండి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు ఉంటుందని తెలిపారు. ఇందుకోసం ఆన్‌లైన్ ద్వారా 300 రూపాయల SED టోకెన్లు రెండు లక్షలు కేటాయించామన్నారు. జనవరి ఒకటో తేదీన సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రక్రియను ప్రారంభిస్తామన్నారు. 10 రోజుల కోటా పూర్తయ్యేంత వరకు నిరంతరాయంగా టోకెన్లు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
ఇవీ చదవండి: